తుంగభద్ర పుష్కరాలు రెండో రోజు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ నదీమతల్లికి చీర, సారె సమర్పించగా మంత్రాలయంలో పీఠాధిపతి పుష్కర స్నానాలను ఆరంభించారు. చాలాచాట్ల కొవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా భక్తులను నదీ స్నానాలు చేశారు.
కరోనా నిబంధనల నడుమ తుంగభద్ర పుష్కరాలు మొదలయ్యాయి. నీటి ద్వారా కరోనా అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం నదీ స్నానాలు నిషేధించింది. చిన్నారులు, వృద్ధులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. జల్లు స్నానాలకు ఏర్పాట్లు జరిగినా సర్కారు నిరాకరించింది. పూజలు, పిండప్రదానాలకు మాత్రమే అనుమతిచ్చింది.