TTD: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల నిలిపివేత
TTD: తిరుపతిలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను టీటీడీ అర్ధంతరంగా నిలిపివేసింది. తిరుపతిలో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నెల 30వరకు టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
TTD: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను టీటీడీ అర్ధంతరంగా నిలిపివేసింది. తిరుమల, తిరుపతిలో కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నెల 30వరకు టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆదేశాలు సెప్టెంబర్ 6వ తేదీ నుండి ఇది అమల్లోకి వస్తాయని తెలిపింది. కావున తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో గల కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్లు ఇవ్వబడవని పేర్కొన్నది. పెరటాసి నెల కావడంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆన్ లైన్ లో దర్శన టికెట్లు బుక్ చేసుకుని మాత్రమే తిరుమలకు రావాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
ఈ నిర్ణయంతో .. భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తుల ఆందోళనకు దిగారు. సర్వదర్శనం టోకెన్ల నిలిపివేతపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే శనివారం వరకూ 3 వేల టికెట్లు జారీ చేసింది. దీంతో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు భారీగా చేరుకున్నారు. సర్వదర్వనం టోకెన్లు నిలిపివేసినట్లు అర్ధాంతరంగా ప్రకటించడంతో భక్తులు నిరసన వ్యక్తం చేశారు. శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతివ్వాలని కోరారు.