TTD Effect with Corona: కరోనాతో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు. మృతి!
TTD Effect with Corona: కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఇక టీటీడీలో కూడా 150కి పైగా మంది కరోనా సోకగా, 18 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు.
TTD Effect with Corona: కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఇక టీటీడీలో కూడా 150కి పైగా మంది కరోనా సోకగా, 18 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా తిరిమాల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాస మూర్తి దీక్షితులు కరోనాతో కన్నుమూశారు. గత కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. దీనితో చికిత్స కోసం ఆయన తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చేరారు.. అక్కడ ఆయన చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. ఇక శ్రీనివాస మూర్తి దీక్షితులు తిరుమల శ్రీవారి ఆలయంలో 20 సంవత్సరాలుకి పైగా పనిచేశారు. ఆయన వీడ్కోలు కూడా సంప్రదాయ పద్ధతిలోనే జరిగాయి. ఆయన మృతిపట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇక అయిన కరోనాతో మృతి చెందడం పట్ల ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు ఇచ్చే అవకాశం లేదు .
ఇక ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెడుగుతూనే ఉన్నాయి. ఆదివారం ఉన్న సమాచారం మేరకు రాష్ట్రంలో గత 24 గంటల్లో 31,148 సాంపిల్స్ ని పరీక్షించగా 5,041 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్తగా 1106 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ వల్ల తూర్పు గోదావరి లో 10, శ్రీకాకుళంలో 8 మంది, కర్నూల్ లో ఏడుగురు, విశాఖపట్నం లో ఏడుగురు, కృష్ణ లో ఏడుగురు , ప్రకాశం లో నలుగురు, అనంతపురం లో ముగ్గురు, కడప లో ముగ్గురు, విజయనగరం లో ముగ్గురు , గుంటూరు లో ఇద్దరు , చిత్తూరు లో ఇద్దరు మరణించారు.ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,754 గా ఉంది. 642 మంది మృతి చెందారు.