Tirumala: తిరుమల శ్రీవారి ఆనంద నిలయానికి.. బంగారు తాపడం పనులకు ముహూర్తం ఖరారు

Tirumala: 2023 ఫిబ్రవరి 23న బాలాలయం నిర్వహించాలని నిర్ణయం

Update: 2022-12-01 06:28 GMT

Tirumala: తిరుమల శ్రీవారి ఆనంద నిలయానికి.. బంగారు తాపడం పనులకు ముహూర్తం ఖరారు

Tirumala: తిరుమల శ్రీవారి ఆనందనిలయానికి బంగారు తాపడం పనులకు ముహూర్తం ఖరారు చేసింది టీటీడీ. 2023 ఫిబ్రవరి 23న బాలాలయం నిర్వహించాలని ముహూర్తం ఖరారు చేశారు.. 6 నెలల్లో తాపడం పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. భక్తులు హుండీలో సమర్పించిన స్వర్ణ కానుకలతో ఆనంద నిలయానికి బంగారు తాపడం చేయాలని నిర్ణయించింది టీటీడీ. 155 కిలోల బంగారం రూ.85 కోట్ల వ్యయంతో బంగారు తాపడం పనులు చేయాలని నిర్ణయించారు. 1958లో చివరిసారిగా ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు చేశారు. 1958లో 18 లక్షల రూపాయల ఖర్చుతో 12 వేల తులాల బంగారాన్ని వినియోగించారు.

Tags:    

Similar News