Dharma Reddy: శ్రీవాణి ట్రస్టుపై చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దు
Dharma Reddy: శ్రీవాణి ట్రస్టుపై దుష్ప్రచారం నమ్మొదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.
Dharma Reddy: శ్రీవాణి ట్రస్టుపై దుష్ప్రచారం నమ్మొదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. శ్రీవాణి ట్రస్టు టోకెన్ల కేటాయింపు పారదర్శకంగానే జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 9 లక్షల మంది ట్రస్టుకు విరాళాలు ఇచ్చారని.. ఆ భక్తులెవరూ శ్రీవాణి ట్రస్టు కార్యకలాపాలపై ఫిర్యాదు చేయలేదన్నారు. ఇక పార్వేటి మంటపం విషయంలో వస్తున్న ఆరోపణలను ఖండిచారు ఈవో ధర్మారెడ్డి. మంటపం శిథిలావస్థకు చేరుకోవటంతోనే జీర్ణోద్ధరణ పనులు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. కావాల్సిన వారికి కాంట్రాక్టులు ఇస్తున్నామనే ఆరోపణలు నమ్మొద్దని.. టీటీడీపై దుష్ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.