టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ.. ఆయన స్థానంలో..

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఆయనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ చీఫ్ సెక్రెటరీ నీలం సాహిణి ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదాయ శాఖ..

Update: 2020-10-01 01:52 GMT

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఆయనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ చీఫ్ సెక్రెటరీ నీలం సాహిణి ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదాయ శాఖ నుంచి ఆయన్ను తప్పించి హెల్త్, మెడికల్, కుటుంబసంక్షేమ శాఖకు నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం టీటీడీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న ఏవీ. ధర్మారెడ్డికి పూర్తిస్థాయిలో ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1993 బ్యాచ్‌‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన అనిల్ కుమార్ సింఘాల్‌ను 2017 మే నెలలో టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. అంతకుముందు ఆయన ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్నారు.

సింఘాల్ రెండేళ్ల పదవీకాలం 2019లోనే ముగిసింది. అయినా ఆయనను టీటీడీ ఈవోగా కోనసాగించింది ప్రభుత్వం. కాగా ఉత్తర భారతదేశానికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్‌ ని టీటీడీ ఈవోగా నియమించడం పట్ల అప్పట్లో తెలుగు అధికారుల్లో కొందరిలో అసంతృప్తి నెలకొన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏవీ. ధర్మారెడ్డి కూడా గతంలో టీటీడీ జేఈవోగా పనిచేశారు. ఆ తరువాత కేంద్ర సర్వీసులో ఉన్న ఆయనను వైసీపీ ప్రభుత్వం టీటీడీకి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు సీఎం జగన్.. ఆ సమయంలో సీఎం డిక్లరేషన్ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇక బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే అనిల్ కుమార్ సింఘాల్ ను తప్పించి ధర్మారెడ్డిని పూర్తిస్థాయి ఈవోగా నియమించడం విశేషం.

Tags:    

Similar News