TTD Tickets: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల..ఇలా బుక్ చేసుకోండి.!

TTD Special Entry Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. దర్శన టికెట్లు, గదుల కోట టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

Update: 2024-06-24 02:53 GMT

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల..ఇలా బుక్ చేసుకోండి.!

 TTD: తిరుమల శ్రీవారిని ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తుల రద్దీతో ఏడుకొండలు గోవింద నామస్మరణతో మారుమ్రోగుతుంటాయి. నిత్యం పలు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు అన్ని సదుపాయాలను కల్పిస్తోంది టీటీడీ. తాజాగా భక్తులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్ని నెలలుగా తిరుమలకు సాధారణ భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనం, గదులు తీసుకోవడం భక్తులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం దర్శన టికెట్లు, గదుల కోటాను విడుదల చేస్తోంది టీటీడీ.

తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటా నేడు ఉదయం 10గంటలకు విడుదల చేయనుంది. అదేవిధంగా సెప్టెంబర్ నెల గదుల కోటాను ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనుంది. దర్శన టికెట్లు గదులను బుక్ చేసుకోవాలనుకునేవారు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 27 ఉదయం 11 గంటలకు టీటీడీ సేవా కోటా టికెట్లను రిలీజ్ చేయనుంది. తిరుమలకు వచ్చే భక్తులు దర్శన టికెట్లు, వసతి గదులు, సేవా కోటాను https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

అటు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేశారు. క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, బ్రేక్ఫాస్ట్, వైద్య సౌకర్యాలను అందిస్తున్నారు. 

Tags:    

Similar News