Tirumala: తిరుమల నడక మార్గంలో ఇనుప కంచె ఏర్పాటు దిశగా టీటీడీ!

Tirumala: అలిపిరి నడకమార్గంలో ఇనుప కంచె ఏర్పాటు దిశగా ప్లాన్ చేస్తున్నామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.

Update: 2023-09-08 08:54 GMT

Tirumala: తిరుమల నడక మార్గంలో ఇనుప కంచె ఏర్పాటు దిశగా టీటీడీ!

Tirumala: అలిపిరి నడకమార్గంలో ఇనుప కంచె ఏర్పాటు దిశగా ప్లాన్ చేస్తున్నామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తిరుమల నడక మార్గాల్లో కంచె నిర్మించాలంటూ చాలా మంది సలహా ఇచ్చారని తెలిపారు ధర్మారెడ్డి. రెండు నడక మార్గాలు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నాయన్నారు. కేంద్ర అటవీశాఖ, వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు టీటీడీ నివేదిక పంపించినట్లు ఆయన తెలిపారు. నడక మార్గంలో చిరుతల సంచారం ఎక్కువగా ఉండడంతో ఇనుప కంచె ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించామన్నారు. కేంద్రం నుంచి అనుమతులు రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News