Polavaram Project: పోలవరం ప్రాజెక్టు గేట్ల ట్రయల్‌ రన్‌ విజయవంతం

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు గేట్ల ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. మొత్తం 48 గేట్లకుగానూ 34 గేట్ల అమరిక పనులు పూర్తి అయ్యాయి.

Update: 2021-03-26 15:14 GMT

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు గేట్ల ట్రయల్‌ రన్‌ విజయవంతం

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు గేట్ల ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. మొత్తం 48 గేట్లకుగానూ 34 గేట్ల అమరిక పనులు పూర్తి అయ్యాయి. 96 సిలిండర్లకుగానూ 56 సిలిండర్ల బిగింపు పనులు కంప్లీట్‌ చేశారు. ఇప్పటికే 44, 43వ గేట్లను కిందకిపైకి ఎత్తడంతో ట్రయల్‌ రన్‌ సక్సెస్‌ అయింది.

హైడ్రాలిక్‌ సిలిండర్‌తో గేటును నిమిషానికి 1.5 మీటర్లు ఎత్తే అవకాశం ఉంది. 2400 టన్నుల ఒత్తిడిని సైతం తట్టుకునేలా గేట్ల డిజైన్‌ చేశారు. గేట్ల ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో మిగతా గేట్లను ఎత్తేందుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. గేట్ల ట్రయల్ రన్ పనులను పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ జీఎంలు సతీష్ బాబు, మిశ్రా,బెకెం ఇంజనీరింగ్ సంస్థ ప్రాజెక్ట్ ఇంచార్జి ఎ.నాగేంద్ర పరిశీలించారు.

Tags:    

Similar News