Visakhapatnam: గోపాలపట్నంలో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీతో ఇద్దరు సూసైడ్‌

Visakhapatnam: ప్రియురాలి మరణం తట్టుకోలేక సూసైడ్‌ చేసుకున్న సూర్య

Update: 2023-08-13 07:21 GMT

Visakhapatnam: గోపాలపట్నంలో ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీతో ఇద్దరు సూసైడ్‌

Visakhapatnam: విశాఖలో ప్రేమకథ విషాదాంతమైంది. ముగ్గురి మధ్య నడిచిన ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో ఇద్దరు ప్రాణాలు బలయ్యాయి. గోపాలపట్నంలో ఇద్దరు యువకులు, మైనర్‌ బాలిక మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇద్దరు యువకుల్లో సాయికుమార్‌ని రహస్యంగా పెళ్లి చేసుకుంది బాలిక. అయితే పెళ్లి తర్వాత సూర్య అనే యువకుడితో కూడా బాలిక సన్నిహితంగా ఉండటంతో ముగ్గురి మధ్య ఘర్షణ జరిగింది. బాలిక ఇంటికి వెళ్లి ఎవరు కావాలో తేల్చుకోవాలని యువకులు ఇద్దరూ గొడవ పడ్డారు. దాంతో మనస్తాపం చెందిన బాలిక ఈనెల 10న ఆత్మహత్యకు పాల్పడగా.. అది తట్టుకోలేక సూర్య అనే యువకుడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. సాయికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Tags:    

Similar News