Top-6 News of the Day: ఏపీలో రాష్ట్రపతి భవన్ విధించాలన్నజగన్ మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-07-19 13:43 GMT

Y S Jagan 

Top-6 News of the Day(19/07/2024)

1. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్

వినుకొండలో ఇటీవల హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్ పరామర్శించారు. రషీద్ హత్యకు వ్యక్తిగత కారణాలుగా చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. రషీద్ హత్య ముమ్మాటికి రాజకీయ హత్యేనని ఆయన చెప్పారు. ఏపీలో శాంతిభద్రతలు లేవని ఆయన ఆరోపించారు. ఈ విషయమై బుధవారం దిల్లీలో ధర్నా చేస్తామని ఆయన ప్రకటించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.


 2. మైక్రోసాఫ్ట్ విండోస్ లో టెక్నికల్ సమస్య: ప్రపంచ వ్యాప్తంగా పలు విమానాలు రద్దు

మైక్రోసాఫ్ట్ విండోస్ లో టెక్నికల్ సమస్య ఏర్పడింది. దీంతో కంప్యూటర్ల స్క్రీన్లపై బ్లూ స్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కన్పించింది. క్రౌడ్ స్ట్రయిక్ అప్ డేట్ కారణంగానే ఈ సమస్య తలెత్తిందని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది. ఈ సమస్యతో ప్రపంచంలోని పలు ఎయిర్ లైన్స్ సంస్థలు విమానాలను రద్దు చేశాయి. మీడియా సంస్థల ప్రసారాలు నిలిచిపోయాయి. ఇండియాలోని ఎన్ఐసీపై ఎలాంటి ప్రభావం లేదని ఐటీ శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ప్రకటించారు.


 3. తెలంగాణలో గ్రూప్ -2, 3 పరీక్షల వాయిదా

తెలంగాణలో గ్రూప్-2, 3 పరీక్షల రద్దుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఏడాది ఆగస్టు 7,8 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థుల నుండి వినతి వచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలనే అభ్యర్థులతో డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క చర్చించారు. గ్రూప్ పరీక్షలను డిసెంబర్ లో నిర్వహించాలని టీజీపీఎస్ సీ ఛైర్మన్ కు ఆయన సూచించారు.


 4. బిల్కిస్ బానో కేసు దోషుల పిటిషన్ కొట్టివేత

బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రెమిషన్ వచ్చేవరకు బెయిల్ మంజూరు చేయాలని ఇద్దరు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.


5. ప్రాణ నష్టం జరగకుండా చూడాలి: భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష

బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం చంద్రబాబు అధికారులతో భారీవర్షాలు, వరదలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణనష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం. వాతావరణ హెచ్చరికలు, పరిస్థితులను అంచనా వేసి అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.


6. పెట్టుబడుల కోసం అమెరికాకు రేవంత్ రెడ్డి టూర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 3 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికాలో పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు.

Tags:    

Similar News