Top-6 News of the Day: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేది లేదన్న కేంద్ర మంత్రి ... మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-07-11 12:41 GMT

కేంద్ర మంత్రి హెచ్ డి కుమారస్వామి

Top-6 News of the Day (11/07/2024)

1. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర మంత్రి హెచ్ డి కుమారస్వామి చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను రక్షించడమే ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆయన పరిశీలించారు. ఈ ఫ్యాక్టరీపై కార్మికులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.


2. తెలంగాణ అసెంబ్లీ 24న షురూ

ఈ నెల 24 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈనెల 25 లేదా 26న రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు.


3. ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామన్న బండి సంజయ్

 ఆంధ‌్రప్రదేశ్ లో  గత ప్రభుత్వ పాలకులు వీరప్పన్ వారసులని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని మంత్రి గురువారంనాడు దర్శించుకున్నారు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపీడీపై నివేదిక కోరుతామన్నారు.


4. చంద్రబాబు: 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ రెడీ

అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమకాలువను ఏపీ సీఎం చంద్రబాబు గురువారం పరిశీలించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందని ఆయన విమర్శించారు. ఆ తర్వాత ఆయన భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించే ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేశారు. 2026 జూన్ నాటికి ఈ ఎయిర్ పోర్టును ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.


5. నీట్‌పై విచారణ ఈ నెల 18కి వాయిదా

నీట్ యూజీ -2024 క్వశ్చన్ పేపర్ లీక్ విషయమై సీబీఐ సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదికను అందించింది. నీట్ ప్రవేశ పరీక్షను మరోసారి నిర్వహించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ నిర్వహిస్తుంది. అయితే సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.


6. ఏపీలో 19 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్ లో 19 మంది ఐఎఎస్ అధికారుల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరితో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News