Tomato Prices: దారుణంగా పడిపోయిన టమోటా ధరలు
Tomato Prices: మదనపల్లి మార్కెట్‌ను ముంచెత్తుతున్నటమోటాలు
Tomato Prices: అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్ ను ముంచెత్తుతున్నటమోటాలు. ప్రతిరోజూ అమ్మకానికి 70 వేల బాక్సుల కాయలు మార్కెట్ కు వస్తున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో రావడం మార్కెట్ చరిత్రలో ఇదే ప్రథమం, 50 లారీల సరుకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. మదనపల్లి, అంగళ్లు, ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ ను టమోటాలు ముంచెత్తున్నాయి. ప్రతిరోజూ 60 వేల నుంచి 70 వేల బాక్సుల కాయలు అమ్మకానికి వస్తున్నాయి.
మార్కెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా టమోటాలు అమ్మకానికి వస్తున్నాయి. నెల రోజుల క్రితం టమోటా ధరకేజీ డబుల్ సెంచరీకి చేరడంతో ధరలు నిలకడగా ఉంటాయన్న ఆశతో నియోజకవర్గంలోని రైతులు రికార్డు స్థాయిలో టమోటా పంటను సాగు చేశారు. ప్రసుత్తం టమోటాలు కోతకు వచ్చాయి... నియోజకవర్గంతో పాటు పక్క జిల్లా అయిన శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం నుంచి టమోటాలను రైతులు మదనపల్లి, అంగళ్ళు, మొలకలచెరువు, మార్కెట్కు తీసుకొస్తున్నారు...మార్కెట్ స్థలం విశాలంగా ఉండడంతో టమోటాలు తీసుకొస్తున్న వాహనాలతోఈ ప్రాంతమంతా నిండిపోతోంది. మండీలు టమోటా బాక్సులతో నిండిపోయాయి...దీంతో మదనపల్లె,అంగళ్లు,ములకలచెరువు మార్కెట్ కిక్కిరిసిపోతోంది. .ప్రధాన గేటు వరకు వాహనాలు నిలిచిపోయాయి.
మార్కెట్లో బుధవారం టమోటాధరలు నాణ్యతను బట్టి 23 కేజీల బాక్పులు 300 రూపాయల నుంచి నుంచిరూ.450 రూపాయల వరకు పలుకుతోంది. కిలో13 నుంచి 19.50 రూపాయల వరకూ పలుకుతోంది. .ఇక్కడి నుంచి టమోటాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీసడ్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ధరలు రికార్డు స్థాయిలో పలుకుతుండటంతో కేవలం ప్రతిరోజూ 10 లారీల కాయలు మాత్రమే ఎగుమతి అయ్యేవి...ప్రస్తుతం 50లారీల టమోటా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతున్నాయి.
టమోటా. 20 రోజుల క్రితం వరకు రైతులకు కాసుల పంట కురిపించింది. ఇప్పుడు అదే రైతుకు కంటతడి పెట్టిస్తోంది. జూన్ జూలై నెలలో అమాంతంగా పెరిగిన టమోటా ధరలు ఆగస్టు 11 వరకు ఊహకందని ధరలతో రైతును కోటీశ్వరుడిని చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంత రైతాంగం ప్రధాన సాంప్రదాయ పంటగా సాగు చేస్తున్న టమోటా ఈసారి రైతుని సంపన్నుడ్ని కూడా చేసింది. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర డబుల్ సెంచరీ పలకడంతో సాగు చేసిన టమోటా ను పంటను కాపలా కాయడమే కష్టంగా మారిపోయిన పరిస్థితికి కారణమైంది.
ప్రస్తుతం 300 లోపు మెట్రిక్ టన్నుల టమోటా మాత్రమే మదనపల్లి మార్కెట్ కు వస్తున్న కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి బయ్యర్లు రాకపోవడం, ఎక్స్ పోర్టు చేసేందుకు ట్రేడర్లు ముందుకు రాకపోవడంతో టమోటా కు డిమాండ్ పడిపోయింది. దీంతో ఇప్పుడు ఎక్స్ పోర్టు క్వాలిటీ కిలో టమోట ధర తొమ్మిది రూపాయలకు చేరింది. దీంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు.