నేడు రైతుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ, పెట్టుబడి రాయితీ సొమ్ము
పంటనష్టం జరిగిన సీజన్‌లోనే పెట్టుబడి రాయితీ అందించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అక్టోబరులో జరిగిన నష్టంపై అంచనాలు సిద్ధం చేసి, పెట్టుబడి రాయితీ చెల్లిస్తున్నారు.
చిన్న, సన్నకారు రైతులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచేందుకు అడుగులు వేస్తోంది. సున్నా వడ్డీ, పెట్టుబడి రాయితీ పథకాల కింద రైతులకు 642 కోట్లు చెల్లించబోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మీటనొక్కి ఈరోజు ఈ నిధుల్ని విడుదల చేయనున్నారు. 2019 ఖరీఫ్‌లో 14.58 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వారందరికీ సున్నా వడ్డీ పథకం కింద 510.32 కోట్లు, గత నెలలో వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టానికి పెట్టుబడి రాయితీగా మరో 132 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
పంటనష్టం జరిగిన సీజన్‌లోనే పెట్టుబడి రాయితీ అందించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అక్టోబరులో జరిగిన నష్టంపై అంచనాలు సిద్ధం చేసి, పెట్టుబడి రాయితీ చెల్లిస్తున్నారు. అర్హులైన ప్రతి రైతుకు సున్నా వడ్డీ రాయితీ అందించేలా చర్యలు చేపట్టారు. రైతు భరోసా కేంద్రాల వద్ద లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నటు ప్రభుత్వం తెలిపింది. 'గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన వడ్డీ రాయితీని కూడా రైతుల ఖాతాల్లో వేస్తూ వస్తున్నామని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.