Nara Lokesh: చంద్రబాబుకు లోకేష్ నాయకత్వంపై నమ్మకం కలుగుతోందా?

Nara Lokesh: లోకేష్ పాదయాత్రను వైసిపి ఎలా చూస్తోంది..?

Update: 2023-08-31 10:57 GMT

Nara Lokesh: లోకేష్ పాదయాత్రను వైసిపి ఎలా చూస్తోంది..?

Nara Lokesh: యువగళం పాదయాత్ర.. తెలుగుదేశం పార్టీ కేడర్‌కు జవసత్వాలు తీసుకొస్తుందా...? మాట్లాడటమే రాదంటూ గతంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న లోకేష్‌.. యువగళంతో ఆ విమర్శలకు చెక్ పెడుతున్నారా..? 2 వందల రోజుల యువగళం పాదయాత్రతో... తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు దొరికినట్టేనా..? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ యాత్ర ఏపీలో అసలు ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది.

జనవరి 27న ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర ఇవాళ్టితో 2 వందల రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 వేల 710 కిలోమీటర్ల యాత్ర ముగిసింది. మొత్తం 185 మండలాలు, మున్సిపాలిటీలు, 16వందల 75 గ్రామాలను టచ్ చేస్తూ యువగళం యాత్ర సాగించారు లోకేష్. నాలుగు వందల రోజుల్లో 4 వేల కిలోమీటర్లు లక్ష్యంగా మొదలైన యాత్ర.. అంతకంటే వేగంగా సాగుతోంది. రోజుకు 13 కిలోమీటర్లకు పైగా యాత్ర చేస్తున్నారు లోకేష్. ఇప్పటివరకు 64 బహిరంగసభల్లో యువనేత లోకేష్ ప్రసంగించారు. 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు.

యువగళంతో తన మాటలకు పదునుపెట్టారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. ప్రభుత్వ తీరుపై విమర్శల డోసు పెంచారు. ముఖాముఖి, రచ్చబండ కార్యక్రమాలతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మళ్లీ బాబు పాలన వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయంటూ.. పాదయాత్రతో ప్రజలను ఆకర్షిస్తున్నారు లోకేష్‌. దీంతో టీడీపీలో జోష్ కూడా పెరిగిందనే చెప్పాలి. నియోజకవర్గాల్లో లోకేష్ యాత్రతో కేడర్‌ మళ్లీ యాక్టివ్ కావడంతో.. అధినేత చంద్రబాబు కూడా లోకేష్ నాయకత్వంపై కాస్త భరోసా పెంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ పాదయాత్ర 200వ రోజుకు చేరిన సందర్భంగా.. లోకేష్ యువగళం, ప్రజాగళం అయిందంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు. అయితే పార్టీకి లోకేష్ యాత్ర మైలేజ్ పెంచుతుందా...? లోకేష్ యాత్ర ఎఫెక్ట్‌ వైసీపీపై చూపుతుందా లేదా అనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News