AP High Court: ఎస్‌ఈసీ హౌస్ మోషన్ పిటిషన్‌పై ఇవాళ విచారణ
AP High Court: పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు డివిజన్ బెంచ్
AP High Court: ఏపీలో పరిషత్ ఎన్నికలపై ఎస్‌ఈసీ వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది హైకోర్టు డివిజన్ బెంచ్. హౌస్ మోషన్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరపనుంది. ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు బ్రేక్ వేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నోటిఫికేషన్ కు పోలింగ్ కు నాలుగు వారాలు సమయం ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పును గుర్తుచేసిన హైకోర్టు ఈనెల ఒకటిన ఎస్ ఈసీ విడుదల చేసిన నోటిఫికేషన్ పై తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది.
అయితే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై స్టే విధిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్ కు వెళ్లింది. నోటిఫికేషన్ ఇచ్చాక ఎన్నికల ప్రక్రియలో హైకోర్టు జోక్యం చేసుకోవడం సరికాదంటూ డివిజన్ బెంచ్ కు ఎస్ ఈసీ నివేదించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ కు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతోనే త్వరగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.దీనిపై రేపు విచారణ జరగనుండటంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.