ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల కమిటీ ఉద్యోగ సంఘాలతో రెండో రోజు చర్చలు కొనసాగించనుంది. వేతన సవరణ సంఘం ఇచ్చిన నివేదికపై చర్చించనుంది. టీఎన్జీవో, టీజీవో, సచివాలయ సంఘం ప్రతినిధులతో మొదటి రోజు సమావేశమైన కమిటీ పీఆర్సీతోపాటు పలు అంశాలపై వారి అభిప్రాయాలను, వినతులను తీసుకుంది. వేతన సవరణ సహా ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని సీఎస్ సోమేశ్ కుమార్ చెప్పారు. చర్చలను ఇవాళ కుడా కొనసాగించనున్న కమిటీ మరికొన్ని సంఘాలతో సమావేశం కానుంది. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్-ట్రెసా, యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్-యూటీఎఫ్, ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ అసోసియేషన్-పీఆర్టీయూ సంఘాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది.