Coronavirus: కంటైన్‌మెంట్‌ జోన్‌గా తిరుపతి

Coronavirus: తిరుపతిలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంక్షలు కఠినతరం చేశారు.

Update: 2021-04-26 07:59 GMT

Coronavirus: కంటైన్‌మెంట్‌ జోన్‌గా తిరుపతి

Coronavirus: తిరుపతిలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంక్షలు కఠినతరం చేశారు. తిరుపతి నగరాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీషా ప్రకటించారు. రేపటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకోనున్నాయి. దుకాణాలు స్వచ్ఛంధంగా మూసివేసేందుకు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ నిర్ణయం తీసుకుంది. తిరుపతికి వచ్చే భక్తులు కూడా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు కమిషనర్. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో వ్యాపార సంఘాలు, ఆటో, జీపు డ్రైవర్ల యూనియన్లతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, నగరపాలక కమిషనర్‌ గిరీషా, ఎస్పీ వెంకటప్పలనాయుడు సమావేశమయ్యారు. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ తీసుకోవడంతో పాటు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై సుదీర్ఘంగా చర్చించారు.

Tags:    

Similar News