Tirumala: భక్తులు గుంపులుగా వెళ్లాలి.. నడకమార్గంలో ఎలుగుబంటి, చిరుత సంచరిస్తున్నాయి - సీసీఎఫ్
Tirumala: వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు.. 300 ట్రాఫ్ కెమెరాలు ఏర్పాటు చేశాం -సీసీఎఫ్
Tirumala: తిరుమల నడకమార్గంలో భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని తిరుపతి సీసీఎఫ్ నాగేశ్వరరావు సూచించారు. తిరుమల కాలినడక మార్గాల్లో భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. నడకమార్గాల్లో వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు....300 ట్రాఫ్ కెమెరాలు ఏర్పాటు చేశామని... ఇందుకోసం 100మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని నాగేశ్వరరావు వెల్లడించారు. నడకమార్గం పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి, చిరుత తిరుగుతున్నాయని భక్తులు అప్రమత్తంగా ఉండాలని సీసీఎఫ్ సూచించారు.