తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నడకదారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశదర్శనానికి కూడా 2గంటల సమయం పడుతోంది. కాగా ప్రస్తుతం పరీక్షల సమయం.. అందునా మార్చి నెల కనుకనే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.