TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలెర్ట్..ఆ తేదీల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు..
Tirumala Brahmotsavam 2024: తిరుమలలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.
Tirumala Brahmotsavam 2024: తిరుమలలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహించనున్నారు.
వాహనసేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 7న రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నారు టీటీడీ అధికారులు.