కాకినాడ జిల్లాలో పులి కోసం కొనసాగుతున్న వేట
*ప్రత్తిపాడు మండలంలో బోన్లు ఏర్పాటు
Kakinada: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. గత 12 రోజులుగా కనుకులేకుండా చేస్తున్న పులి జాడ తెలుసుకునేందుకు అటవి అధికారులు, సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సీసీ కెమెరాల ఏర్పాటు, గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ పులిని బంధించడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా పశువులను చంపి తింటుంది.
పులి సంచారంతో ఒమ్మంగి, పొదురుపాక, పాండువలపాలెం, పోతులూరు, శరభవరం గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పంట పొలాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పలు చోట్ల పులి బోన్లను ఏర్పాటు చేసిన అధికారులు రాత్రివేళల్లో ఒంటరిగా ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. పులిని త్వరగా బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.