AP Rains: రాగల మూడు రోజుల్లో ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

AP Rains: అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి

Update: 2023-05-06 15:00 GMT

AP Rains: రాగల మూడు రోజుల్లో ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు 

AP Rains: రాగల మూడు రోజుల్లో ఏపీలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడి అల్పపీడనంగా మారి... తుఫానుగా మారనుంది. దానికి మోకా తుఫాన్‌గా ఇప్పటికే పేరు పెట్టారు. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

అంతేకాదు దక్షిణ అంతర్గత కర్ణాటకను ఆనుకొని తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని .. ఈ ప్రభావంతో ప్రభావంతో ఏపీలో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది.

ప్రస్తుత అంచనాల ప్రకారం.. మోకా తుఫాన్ ప్రభావం ఏపీపై అంతగా ఉండకపోవచ్చని వాతావరణశాఖ భావిస్తోంది. ఈ తుఫాన్‌ బంగ్లాదేశ్‌, మయన్మార్‌ తీరాల దిశగా వెళ్లే అవకాశముందని పేర్కొంది. అల్పపీడనం ఏర్పడిన.. దాని గమనం అనుగుణంగా వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.

అల్పపీడనం నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ఏపీ వాతావరణశాఖ పేర్కొంది. ఆదివారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని.. వేటకు వెళ్లిన వారు శనివారం సాయంత్రంలోగా ఇళ్లకు చేరుకోవాలని సూచించింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల కింద ఉండవద్దని చెప్పారు.

Tags:    

Similar News