Palnadu District: ఘోర ప్రమాదం.. నాపరాళ్లు మీదపడి ముగ్గురు కూలీలు మృతి

Palnadu District: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2022-09-04 07:03 GMT

Palnadu District: ఘోర ప్రమాదం.. నాపరాళ్లు మీదపడి ముగ్గురు కూలీలు మృతి

Palnadu District: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాపరాళ్లతో మాచర్ల నుంచి భీమవరం వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడగా.. ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. నాపరాళ్లు మీద పడి లారీలో ఉన్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. కూలీలు పసర్లపాడుకు చెందిన అమారేసు శ్రీను, దొడ్డ భాస్కరరావు, రమావత్ మునినాయక్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News