Highest Corona Cases in 3 districts of AP: ఏపీలోని ఆ మూడు జిల్లాల్లో కరోనా ఉధృతి
Highest Corona Cases in 3 districts of AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతోంది.రోజురోజుకు కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి.
Highest Corona Cases in 3 districts of AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతోంది.రోజురోజుకు కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి నియంత్రణకు జగన్ సర్కార్ ఎన్నో రకాలుగా చర్యలు తీసుకుంటుంది. కొన్ని జిల్లాలోని ప్రజలు స్వయంగా లాక్ డౌన్ కూడా విధించుకుంటున్నారు. తమను తాము నియంత్రించుకుంటున్నారు. అయినా కరోనా విజృంభన మాత్రము ఆగడం లేదు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 72,711 ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా 884 మంది మరణించారు. అలాగే చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన బడ్డారు.
కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, గుంటూరు, తూర్పు గోదావరి ఈ మూడు జిల్లాల్లో కరోనా ఉధృతి ఎక్కువగానే ఉంది . పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకు అత్యధికంగా పెరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయి. ఈ జిల్లాలో కరోనా 10 వేల మార్కును దాటింది. ప్రస్తుతం అక్కడ 10,038 కరోనా కేసులు ఉండగా, 96 మంది కరోనా మహమ్మారికి బలైయ్యారు. ఇక తూర్పు గోదావరిలో 6786 యాక్టీవ్ కేసులు ఉండగా, 3156 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటు గుంటూరులో అదే పరిస్థితి. ఇప్పటి వరకూ 8097 కోవిడ్ కేసులు రిజిస్టర్ అవ్వగా, 85 మంది చనిపోయారు. అలాగే కర్నూలులో 8701 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఏపీలోనే అత్యధికంగా ఈ జిల్లాలో 142 మంది కరోనాతో మరణించారు. దీంతో అధికారులు, వైద్యులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.