Nellore: నెల్లూరు రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్

Nellore Railway Station: ఒకటో ప్లాట్‌ఫామ్‌పై బాంబు పెట్టారని 112 నంబర్‌కు ఫోన్

Update: 2023-09-05 05:52 GMT

Nellore: నెల్లూరు రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్

Nellore Railway Station: నెల్లూరు రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం రేగింది. ఒకటో ప్లాట్‌ఫామ్‌పై బాంబు పెట్టారని.. అది కొద్దిసేపట్లో పేలుతుందంటూ 112 నంబర్‌కు గుర్తు తెలియని వ్యక్తి కాల్‌ చేశారు. ఈ విషయాన్ని రైల్వేస్టేషన్‌ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌కు సమాచారం అందించడంతో రైల్వేస్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులను రైల్వేస్టేషన్‌ నుంచి దూరంగా పంపించి పార్సిల్‌ కేంద్రం, బ్యాగులను తనిఖీ చేశారు. ఎక్కడా బాంబు లేకపోవడంతో ఆకతాయి పనిగా తేల్చారు. దీంతో ప్రయాణికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆకతాయి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Tags:    

Similar News