Budameru High Alert: బుడమేరకు మళ్లీ వరద ప్రవాహం.. ఆ ప్రాంతాలకు మళ్లీ పొంచి ఉన్న ముప్పు

Budameru High Alert: విజయవాడకు మళ్లీ వరద ముప్పు పొంచి ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బుడమేరు పరివాహ ప్రాంతంలో నీటి ప్రవాహనం పెరిగింది. బుడమేరు గండ్లు పూడ్చినా సోమవారం తెల్లవారుజాము నుంచి వరద ప్రవాహం పెరుగడంతో హై అలర్ట్ జారీ చేశారు అధికారులు.

Update: 2024-09-09 03:00 GMT

Budameru High Alert: బుడమేరకు మళ్లీ వరద ప్రవాహం.. ఆ ప్రాంతాలకు మళ్లీ పొంచి ఉన్న ముప్పు

Budameru High Alert: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు విజయవాడను అతలాకుతలం చేశాయి. ఇప్పటికీ విజయవాడ నగరంలో జలదిగ్బంధంలోనే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి విజయవాడకు వరద ముప్పు పొంచి ఉంది. బుడమేరు పరివాహక ప్రాంతాలకు కృష్ణా ఇరిగేషన్ సర్కిల్ అధికారులు అదివారం అర్థరాత్రి హై అలర్ట్ హెచ్చరికలను జారీ చేశారు. దీంతో సోమవారం తెల్లవారు జాము నుంచి పోలీసులు , రెవిన్యూ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

కాగా ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో బుడమేరుకు వరద నీరు వచ్చి చేరుతోంది. పరీవాహక ప్రాంతంలో నిరంతరంగా, భారీ వర్షాలు కురుస్తుండటంతో క్యాచ్ మెంట్ ఏరియాలో భారీ వర్షపాతం అంచనా వేశారు. బుడమేరకు ఎప్పుడైనా భారీ, ఆకస్మిక వరదలు వచ్చే ఛాన్స్ ఉందని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వెలగలేరు రెగ్యులేటర్ 2.7 అడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నాయి. బుడమేరు డైవర్షన్ ఛానెల్ కు గండ్లు పడటం, వరద ముంపు ముంచెత్తడం వంటి ఘటనల నేపథ్యంలో మరోసారి వరద వస్తుందని అంచనా వేస్తున్నారు. బుడమేరు ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాల్సి రావడంతో ముందే అలర్ట్ చేశారు. బుడమేరు ప్రవాహం 7 అడుగుల ఎత్తుకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వరద దిగువకు విడుదల చేస్తే బుడమేరు పక్కనే ఉన్న ఈలప్రోలు, రాయనపాు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్, గుణదల, ఎన్టీఆఱ్ జిల్లా రామవర్లపాడు తదితర ప్రాంతాలోని లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యే ఛాన్స్ ఉందని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను తక్షణమే అక్కడి నుంచి తరలించి అవసరమైన ముందస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు, ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు.


Full View


Tags:    

Similar News