Sri Sathyasai District: వినాయక మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణించిన యువకుడు

Sri Sathyasai District: కన్నీరుమున్నీరు అవుతున్న కుటుంబసభ్యులు

Update: 2023-09-21 08:41 GMT

Sri Sathyasai District: వినాయక మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణించిన యువకుడు

Sri Sathyasai District: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక మండపం వద్ద డాన్స్‌ చేస్తూ ప్రసాద్‌ అనే యువకుడు గుండెపోటుతో మరణించాడు. నిన్న రాత్రి మండపం వద్ద మరో యువకుడితో కలిసి ప్రసాద్‌ డీజే పాటలకు స్టెప్పులేశాడు. అంతలోనే గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అప్పటి వరకు కళ్లముందే డ్యాన్స్‌ చేస్తున్న ప్రసాద్‌ మృతి చెందడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Tags:    

Similar News