Chandrababu Naidu: తిరుమలలో గత ప్రభుత్వం సంప్రదాయాలు పాటించలేదు
Chandrababu Naidu: ప్రజల మనోభావాలకు వైసీపీ ప్రభుత్వం విలువ ఇవ్వలేదు
Chandrababu Naidu: వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రతి దేవాలయంలో అపచారాలు జరిగాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తిరుమలలో గత ప్రభుత్వం సంప్రదాయాలను పాటించలేదని, ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వలేదని విమర్శించారు. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో NDDB రిపోర్ట్ ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా వైసీపీ నేతలు బుకాయిస్తున్నారని విమర్శించారు. కిలో ఆవు నెయ్యి 320 రూపాయలకు ఎలా వస్తుంది, శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లేంటని ప్రశ్నించారు.
తప్పు చేసిందే కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే తిరుమల ప్రక్షాళన చేయాలంటూ కొత్త ఈవోకు సూచించినట్లు చెప్పారు. ఆయనే అనేక చర్యలు తీసుకుని, లడ్డూ నాణ్యత పెంచారన్నారు. కానీ ఇన్ని విషయాలు ఏ రోజూ బయటికి వచ్చి చెప్పలేదని, ప్రస్తుతం ఆ ఏడుకొండల వాడే లడ్డూ వ్యవహారంపై తనతో మాట్లాడించాడేమోనని సీఎం చంద్రబాబు మాట్లాడారు. టీటీడీ విషయంలో ఏం చేయాలన్నది చర్చిస్తున్నామన్నారు.