TTD: బ్రహ్మోత్సవాలపై కీలక నిర్ణయం తీసుకోనున్న టీటీడీ నూతన పాలకమండలి
TTD: సమావేశం దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
TTD: తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ నూతన పాలకమండల సమావేశం ప్రారంభమైంది. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో త్వరలో జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. కృష్ణమూర్తి వైద్యనాథన్ మినహా మిగిలిన 27 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. తిరుమల కాలినడక మార్గంలో వన్యప్రాణులు సంచారిస్తున్ననేపథ్యంలో, నడకదారిలో చేపట్టిన చర్యలతో పాటు టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై చర్చ సాగనుంది.