Sarkar: మరో భారీ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమౌతున్న ప్రభుత్వం..ఒక్కో ఇంటికి రూ. 25వేలు ఇచ్చేలా ప్లాన్

Government: ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందించేందుకు రెడీ అవుతోంది. ఒక్కొక్కరికి రూ. 25వేలు అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే చాలా మంది ఊరట లభిస్తుంది.

Update: 2024-09-11 03:27 GMT

Sarkar: మరో భారీ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమౌతున్న ప్రభుత్వం..ఒక్కో ఇంటికి రూ. 25వేలు ఇచ్చేలా ప్లాన్

 Government: భారీ వర్షాలతో ఏపీలో కోస్తా ఏరియాలో విజయవాడ అతలాకుతలం అయ్యింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా పంట నష్టం కలిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వం నష్టపోయిన వారికి శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్లాన్ చేస్తోంది. విజయవాడ వరద బాధితులను ఆందుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది. బాగా నీట మునిగిన ఇళ్లకు రూ. 25వేల చొప్పున డబ్బులు ఇచ్చేందుకు సిద్దమయ్యింది. పాక్షికంగా మునిగిన ఇళ్లకు అయితే రూ. 10వేలు చొప్పున ఆర్థిక సాయం అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

అంతేకాదు ఆటోలు, టాక్సీల రిపేర్లకు రూ. 10వేలు ఇవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇంకా బైకులకు అయితే రూ. 3వేల చొప్పున ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా పంటలు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన ఆర్థిక సాయం పై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మొదట ఏలూరు జిల్లా కైకలూరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. తర్వాత పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలోని ఉప్పుటేరు ప్రాంతాన్ని పరిశీలించి రైతులకు సమావేమవుతారు. ఆ తర్వాత కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని రాజుపాలంలో పొలాలను పరిశీలిస్తారు.

అటు తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు, రేపు కేంద్ర బ్రుందాలు పర్యటిస్తాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సారథ్యంలో రెండు బ్రుందాలు ఏపీకి వస్తాయి. నేడు క్రుష్ణా, బాపట్ల, రేపు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తాయి. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కీర్తి ప్రతాప్ సింగ్ నేత్రుత్వంలోని బ్రుందం తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది.


Tags:    

Similar News