Parvathipuram: సమ్మెతో నిలిచిన తాగునీటి సరఫరా.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ప్రజలు
Parvathipuram: కొత్తవలస రోడ్డుపై రాస్తారోకో చేపట్టిన స్థానిక ప్రజలు
Parvathipuram: పార్వతిపురం మున్సిపాలిటీలోని తాగునీటి విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో ఉన్న కారణంగా గత ఐదు రోజులుగా తాగునీటి సరఫరా జరగడంలేదని, తాగు నీటి కోసం ఇక్కట్లు పడుతున్నామని కొత్తవలస ప్రాంత ప్రజలు 8 వ వార్డు టిడిపి కౌన్సిలర్ కోరాడ నారాయణరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొత్తవలస ఫ్లై ఓవర్ బ్రిడ్జి డౌన్ లో మహిళలు, చిన్నారులు జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సుమారు గంటల సమయం జరిగిన ఈ ఆందోళన కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పట్టణ సిఐ కృష్ణారావు పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానిక చేరుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది ఉందని ఆందోళన విరమించాలని ప్రజలను కోరగా, సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదు అని చెప్పడంతో పోలీసులకు, ప్రజలకు మధ్య కొంతసేపు స్వల్ప వాగ్వాదం జరిగింది.