Vijayawada: విజయవాడ దుర్గగుడి చైర్మన్, ఈవో మధ్య మరోసారి బయటపడ్డ విభేదాలు
Vijayawada: ఈవో భ్రమరాంబ తీరుపై చైర్మన్ కర్నాటి రాంబాబు అసహనం
Kanaka Durga Temple: విజయవాడ దుర్గగుడి చైర్మన్, ఈవో మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఈవో బ్రమరాంబ తీరుపై చైర్మన్ కర్నాటి రాంబాబు అసహనం వ్యక్తం చేశారు. దుర్గగుడి అంతర్గత బదిలీల్లో భాగంగా చైర్మన్ పేషీలోని ఉద్యోగులను ఈవో బదిలీ చేశారు. చైర్మన్ పేషీలో సీసీ, అటెండర్లు, సిబ్బంది బదిలీ అయ్యారు. దీంతో శాకాంబరి ఉత్సవాల వేళ చైర్మన్ పేషీలో సీసీ ఛార్జ్ తీసుకోలేదు. చైర్మన్ పేషీలో దేవస్థాన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో చైర్మన్, పాలకమండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవో ఏకపక్షంగా వ్యహరిస్తున్నారంటూ గతంలోనే ఓ సారి సీఎంకు చైర్మన్ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు బదిలీల కేంద్రంగా మరోసారి ఇద్దరి మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి.