Nara Lokesh: నారా లోకేష్ సీఐడీ విచారణ ఈనెల 10కి వాయిదా
Nara Lokesh: గంటపాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం
Nara Lokesh: సీఐడీ నోటీసులపై నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలపై లోకేష్ హైకోర్టులో సవాల్ చేశారు. లోకేష్ సీఐడీ విచారణ ఈనెల 10కి వాయిదా వేసినట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 10న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే విచారించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలోనే లోకేష్‌ను విచారించాలని కోర్టు తెలిపింది. మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది.