Vizag Steel Plant: విశాఖ స్టీల్‌కు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ముమ్మర ప్రయత్నాలు

Vizag Steel Plant: విశాఖ స్టీల్ మనుగడ సాగించేందుకు కేంద్ర పరిశీలనలో ప్రతిపాదనలు

Update: 2024-09-27 16:30 GMT

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌కు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ముమ్మర ప్రయత్నాలు

Vizag Steel Plant: విశాఖ స్టీల్ కు శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. విశాఖ స్టీల్ మనుగడ సాగించేందుకు కేంద్ర పరిశీలనలో ప్రతిపాదనలు ఉన్నాయి. సుమారు 35 వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ కు జవసత్వాలు ఇవ్వాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. “విశాఖ స్టీల్” గా పిలిచే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ ను మరో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన సెయిల్ లో విలీనం చేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

విశాఖ స్టీల్ కు చెందిన భూమిలో కొంత భూమిని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ కు అమ్మడం, విశాఖ స్టీల్ కున్న బ్యాంకుల రుణాలను చెల్లింపు చేయడం మరో ప్రతిపాదన ఉంది. సుమారు 2 వేల ఎకరాలను ఎన్.ఎమ్.డి.సికి అమ్మి, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన “ఎన్.ఎమ్.డి.సి” ఒక “పెల్లెట్ ప్లాంట్” నెలకొల్పే ఆలోచన చేస్తున్నారు.

Tags:    

Similar News