Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఉద్రిక్తత

Andhra Pradesh: 10వ వార్డులో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తల దాడి * తాతాజీపై కత్తితో దాడి చేసిన వైసీపీ కార్యకర్త

Update: 2021-03-10 13:16 GMT

Representational Image

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పిఠాపురం 10వ వార్డులో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. విజయం తమదేనంటూ టీడీపీ కార్యకర్త కరెడ్ల తాతాజీపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తాతాజీకి తీవ్రగాయాలు కావడంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే.. దాడి సమయంలో వైసీపీ కార్యకర్తలు మద్యం మత్తులో ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.  

Tags:    

Similar News