నెల్లూరు జిల్లా చిరమన పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత
* పదే పదే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఓ వర్గం వ్యక్తి * అభ్యంతరం తెలిపిన మరో వర్గం
నెల్లూరు జిల్లా చిరమన పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార వైసీపీకి చెందిన రెండు గ్రూపులు సర్పంచ్ పదవికి పోటీకి దిగాయి. అయితే ఓ వర్గానికి చెందిన వ్యక్తి పదే పదే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి, వస్తుండడంతో మరో వర్గం వారు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం.. తోపులాటకు దారితీసింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తమ లాఠీలతో ఆందోళనకారులను చెదరగొట్టారు.