Anantapur: ఓ ప్రైవేట్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత.. డాక్టర్ల నిర్లక్ష్యంతో గర్బిణి సహా శిశువు మృతి

Anantapur: తల్లీబిడ్డ మృతి చెందడంతో బంధువుల ఆందోళన

Update: 2023-10-03 08:50 GMT

Anantapur: ఓ ప్రైవేట్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత.. డాక్టర్ల నిర్లక్ష్యంతో గర్బిణి సహా శిశువు మృతి

Anantapur: అనంతపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి సహా శిశువు మృతి చెందారని ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు బంధువులు. గార్లదిన్నె మండల కొత్తపల్లి గ్రామానికి చెందిన మహాలక్ష్మీ కాన్పు కోసం హాస్పిటల్‌లో చేరడంతో వైద్యులు కాన్పు చేశారు. అయితే తల్లీబిడ్డ మృతి చెందినట్లు వైద్యులు కుటంబసభ్యులకు తెలియజేశారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యమే ఇద్దరి మరణాలకు కారణమంటూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబసభ్యులతో చర్చించి న్యాయం జరిగేలా చూస్తామని మాట్లాడారు.

Tags:    

Similar News