Temple with YS Jagan Statue: జగన్ విగ్రహంతో గుడి
Temple with YS Jagan Statue: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రియబర్స్ మెంట్ వంటి పథకాలు ప్రవేశపెట్టి, పేద హృదయాల్లో నిలిచిపోయవడంతో ఆయన్ను దేవుడిలా కొలుస్తూ పలుచోట్ల ఆలయాలు నిర్మాణం చేశారు.
Temple with YS Jagan Statue: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రియబర్స్ మెంట్ వంటి పథకాలు ప్రవేశపెట్టి, పేద హృదయాల్లో నిలిచిపోయవడంతో ఆయన్ను దేవుడిలా కొలుస్తూ పలుచోట్ల ఆలయాలు నిర్మాణం చేశారు. అదే కోవలో ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి పేదల సంక్షేమం కోసం పలు పథకాలను ప్రకటించడమే కాకుండా వాటిని ఖచ్చితంగా అమలు చేయడంతో వాళ్ల తండ్రి మాదిరిగా చూస్తున్న కొంతమంది ఆలయాన్ని నిర్మాణం చేసేందుకు నిర్ణయించారు.
అభిమాన హీరోయిన్లకు గుడులు కట్టే కల్చర్ తమిళనాడులో ఉంది. తమిళ తంబీలు బొద్దుగా ఉండే అందాల తారాలకు ఫిదా అయిపోయి వెంటనే గుడులు కట్టేస్తారు. ఖుష్బూ, నమితలకు ఇప్పటికే పలుచోట్ల గుడులు కట్టేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి సైతం గుడి కట్టించేందుకు అప్పట్లో ప్లాన్ వేసినా తలైవా వారించడంతో ఆగిపోయారు. అయితే తెలుగునాట ఈ కల్చర్ లేనేలేదు. హీరోల్ని, హీరోయిన్లను పిచ్చిగా అభిమానిస్తారు కానీ, మరీ గుడులు కట్టి పూజలు చేసేంత పీక్‌లో పిచ్చి లేదు.
అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు కూడా గుడి కట్టేందుకు అడుగులు పడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ నేతలు కట్టిస్తున్నారు. గోపాలపురం మండలం రాజంపాలెంలో ఈ గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన కూడా చేశారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు భవిష్యత్‌లో కూడా గుర్తుండి పోయేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా వైసీపీ నేత కురకూరి నాగేశ్వర్‌రావు చెప్పుకొచ్చారు.
జగన్ సంక్షేమ పథకాలను గుర్తుచేసుకుంటూ ఆయనను ఒక దేవుడిలా కొలవాలనే ఉద్దేశ్యంతోనే కోవెల కడుతున్నట్లు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు చెప్పారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం దేశంలో ఎవరూ చేయని విధంగా వేల కిలోమీటర్లు రాజశేఖర్‌రెడ్డి, జగన్ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. వై.ఎస్. ఫ్యామిలీ కారణ జన్ములని, ప్రజలకు సేవ చేయాలనే ఆ కుటుంబాన్ని దేవుడు భూమి మీదకు పంపాడని వైసీపీ నేత కురుకూరి నాగేశ్వర్‌రావు తెలిపారు. జగన్ చెంతకు ఏ దుష్ట శక్తులు చేరకూడదనే లక్ష్యంతోనే గుడి నిర్మిస్తున్నట్లు వివరించారు.