దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్
ప్రతీ ఇంటి లోగిలి కార్తీక దీపకాంతులతో వెలుగులీనాలని, అన్నదాత కళ్లల్లో ఆనందపు కాంతులు వెల్లివిరియాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అజ్ఞానాంధకారాలు తొలగించి విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలి
తెలుగు ప్రజలందరికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. "చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక.. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలి" ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
ప్రతీ ఇంటి లోగిలి కార్తీక దీపకాంతులతో వెలుగులీనాలని, అన్నదాత కళ్లల్లో ఆనందపు కాంతులు వెల్లివిరియాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అజ్ఞానాంధకారాలు తొలగించి విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలి" అని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు :
ఆనందకరమైన దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీపావళి యొక్క దైవిక కాంతి మన అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని అందిస్తుంది. దీపావళి చెడుపై మంచి సాధించే విజయాన్ని సూచిస్తుంది. కరోనా వంటి సందర్భాలు, విపత్తులను జయించటానికి, శాంతి, స్నేహం, మత సామరస్యాన్ని నింపిన సమాజాన్ని నిర్మించడానికి మనం కృషి చేయాలి. ముసుగు ధరించడం, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరాన్ని పాటించటం ద్వారా ఇంకా ఉనికిలో ఉన్నందున కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించాలని నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పండుగ సందర్భంగా మనందరికీ జగన్నాథ్, వెంకటేశ్వరుడిని ఆశీర్వాదాలను లభించాలని ప్రార్థిస్తున్నాను. " అని అయన తెలిపారు.
హిందువులు దీపావళి పండగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.
చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు