ఇసుక కొరతపై చంద్రబాబు అధ్యక్షతన నిరసన

Update: 2020-12-02 06:23 GMT

ఇసుక కొరత, నూతన ఇసుక విధానానికి నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆపార్టీ నేతలు నిరసనకు దిగారు. తాపీ పనిముట్లు, బంగారం కొలిచే త్రాసుతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఇసుక ధరల పెంపు, కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కొల్పోయారంటూ నినాదాలు చేశారు. గతంలో ఉచితంగా మారిన ఇసుక నేడు భారంగా మారిందని విమర్శలు గుప్పిస్తున్నారు.

రాష్ట్రంలో ఇసుక సమస్య వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 30లక్షల మంది పరిస్థితి దుర్భరంగా మారిందని ధ్వజమెత్తారు. కొత్త విధానం ప్రకటించకుండానే టీడీపీ అమలు చేసిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి.. ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించిందని మండిపడ్డారు. పనుల్లేక ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికులవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. తాము తెచ్చిన ఇసుక విధానం అవినీతి విధానమని ప్రభుత్వమే పత్రికల్లో ప్రకటనలిచ్చి మరీ ఒప్పకున్నారని ఎద్దేవా చేశారు. 18 నెలలుగా జరిగిన ఇసుక దోపిడీ జే-ట్యాక్స్‌కి వెళ్లిందని నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికైనా మనసు మార్చుకుని రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News