ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు రెండు రోజు సస్పెన్షన్‌కు గురయ్యారు. సభా ముగిసే సమయానికి 15 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే ఈరోజు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మినహా 15మంది సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. అశోక్, భవాని, జోగేశ్వరరావు, గొట్టిపాటి రవి, చిన్నరాజప్ప, అనగాని సత్యప్రసాద్, అచ్చంనాయుడు, గన్నబాబు, పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణ, బాలవీరాంజనేయ స్వామి, గద్దె రామ్మోహన్‌పై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.
ఏపీ అసెంబ్లీ రెండో రోజు మరింత హీటెక్కింది. టిడ్కో ఇళ్లపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. స్పీకర్ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు వేలెత్తి చూపిస్తూ మాట్లాడడంతో బాబు తీరుపై స్పీకర్ తమ్మినేని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబు స్పీకర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్.. చంద్రబాబు మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలంటూ ఫైర్ అయ్యారు. మరోవైపు స్పీకర్‌ను ఉద్దేశించి చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కరణం ధర్మశ్రీ తదితరులు మాట్లాడుతూ స్పీకర్‌కు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.