స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తా: గంటా
*టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా *విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన *స్పీకర్‌కు రాజీనామా లేఖ రాసిన గంటా శ్రీనివాసరావు
స్టీల్‌ప్లాంట్ కోసం నాడు ఎందరో ప్రాణత్యాగం చేస్తే.. ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించడం దారుణమన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడమంటే శరీరం నుంచి తలను తీసేసినట్టే అని వ్యాఖ్యానించిన గంటా.. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీలకతీతంగా విశాఖ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని గంటా పిలుపునిచ్చారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంటా ప్రకటించారు.
స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడమంటే శరీరం నుంచి తలను తీసేసినట్టుగా ఉందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్ కోసం నాడు ఎందరో ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. పార్టీలకతీతంగా విశాఖ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని గంటా పిలుపునిచ్చారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకతీతంగా ప్రజాఉద్యమం రాబోతోందని జోస్యం చెప్పారు. రాజీనామాలతో ఒత్తిడి పెంచుతామని తెలిపారు.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజీనామా లేఖను లెటర్ ప్యాడ్‌పై స్వయంగా రాసి స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నానని, ఆమోదించాలని కోరారు.