ఏలూరు ఘటన : ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ నారా లోకేష్ ఫైర్
ఏలూరులో అంతు చిక్కని వ్యాధి బారిన పడుతున్న ప్రజల సంఖ్య క్రమంగా పెరుతోంది. ఇప్పటికే 227 మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఏలూరులో అంతు చిక్కని వ్యాధి బారిన పడుతున్న ప్రజల సంఖ్య క్రమంగా పెరుతోంది. ఇప్పటికే 227 మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల పరిస్థితి తలచుకుంటే ఆందోళనగా ఉందన్నారు. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేశారు.
"ఏలూరులో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 300 మంది అస్వస్థతకు గురయ్యారు.ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించాను.ప్రజలు అనారోగ్యానికి గురైన ప్రాంతాల్లో పర్యటించాను.వైకాపా ప్రభుత్వం పారిశుధ్యాన్ని గాలికోదిలేయడంతో నీరు కలుషితమైంది. వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.మెరుగైన వైద్య సహాయం అందించాలి" అని లోకేష్ ట్వీట్ చేశారు.