Kuna Ravi Fires on AP Govt: శ్రీకాకుళం జిల్లాను వైసిపి ప్రభుత్వం ఎడారిలో తయారు చేసింది: కూనరవి
Kuna Ravi Fires on AP Govt | అమరావతిని చూస్తే ఎడారిలా ఉందన్న తమ్మినేని సీతారాంకు ఆముదాలవలస రైతుల కష్టాలు కనిపించడం లేదా?
Kuna Ravi Fires on AP Govt | అమరావతిని చూస్తే ఎడారిలా ఉందన్న తమ్మినేని సీతారాంకు ఆముదాలవలస రైతుల కష్టాలు కనిపించడం లేదా? జిల్లాలో వరి పండించే ఏకైక ప్రాంతంలో రైతులు వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.. 80 శాతం భూములు కాలువల ఆధారితంగా పంటలు సాగు చేసుకుంటున్నారు. సీతారాం నోటితో అమరావతి ఎడారి అన్నారు, ఇప్పుడు శ్రీకాకుళం ఎడారిగా మారింది..
2018 టిడిపి హయాంలో జిల్లాలో 5 లక్షల 80 వేల ఎకరాలను రైతులు సాగు చేశారు. జగనన్న పాలన, జగనన్న పాదం శ్రీకాకుళం జిల్లాకు శాపంగా మారింది. 2019 ఖరీఫ్ లో రైతులు అతికష్టం మీద 5 లక్షల 30 వేల ఎకరాలు సాగు మాత్రమే చేయగలిగారు. 2020లో కేవలం 4 లక్షల 20 వేల ఎకరాలు మాత్రమే సాగు చేసే పరిస్థితి రైతులది. వరుణుడు కరుణించకపోవడం వల్ల రైతుల వరినాట్లు ఎండిపోతున్నాయి. జగన్ అసమర్థత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా శివారు ప్రాంతాల్లో రైతులకు సాగునీరు అందించే పరిస్థితి లేదు. ఇటువంటి దయనీయ పరిస్థితి తెలుగుదేశం హయాంలో కానీ, గతంలో ఎన్నడూ జరగలేదు. జగన్ పాలనా విధానం జిల్లా రైతుల పాలిట శాపంగా మారింది.
జిల్లాలో 57 శాతం వర్షపాతం తక్కువగా నమోదైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు. రైతు భరోసా కేంద్రాలు, రైతు వినాశక కేంద్రాలుగా మారాయి. వాలంటీర్ ల ద్వారా వైసిపి నాయకులు యూరియాని బ్లాక్ చేసి మార్కెట్ లో అమ్ముకుంటున్నారు.. బస్తా యూరియాని 350 రూపాయలకు వైసిపి నాయకులు అమ్ముకుంటున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.జగన్ అవినీతిలో జిల్లా యంత్రాంగం కూడా కూరుకుపోతున్నారు.
జగన్ ప్రభుత్వ పాలసీల్లోనే అవినీతి, అక్రమాలు, దోపిడీ ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో స్పీకర్, ఉపముఖ్యమంత్రి, మంత్రి ఉన్నారు ఒక్కరైనా రైతుల గురించి ఆలోచన చేస్తున్నారా? తమ్మినేని సీతారాంకి ఊకదంపుడు ఉపన్యాసాలు మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు. జిల్లా కలెక్టర్ వెంటనే రైతాంగానికి యూరియా అందించేందుకు చర్యలు చేపట్టాలని.. రైతు భరోసా కేంద్రాల నుంచి కాకుండా సొసైటీ, ట్రేడర్స్ ద్వారా రైతులకు యూరియా అందేలా చూడాలని కున రవి ప్రభుత్వం పై మండిపడ్డారు.