మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసు : మాజీమంత్రి కొల్లు రవీంద్రకు నోటీసులు

Update: 2020-12-03 06:59 GMT

మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. విచారణకు హాజరుకావాలని మాజీమంత్రి కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే మంత్రిపై హత్యాయత్నం కేసులో నిందితుడి సోదరి ఉమాదేవితో పాటు పలువురు టీడీపీ నాయకులను రెండ్రోజుల పాటు విచారించారు పోలీసులు.

మంత్రి పేర్నినానిపై దాడి చేసిన నిందితుడిని కోర్టు అనుమతితో చిలకలపూడి పీఎస్‌కు తరలించారు. నిందితుడు బడుగు నాగేశ్వరరావు మచిలీపట్నం సబ్‌జైలులో కస్టడీలో ఉన్నాడు. అయితే విచారణ నేపథ్యంలో చిలకలపూడి సీఐ వెంకట నారాయణ కోర్టు అనుమతితో నిందితుడుని భార బందోబస్తు మధ్య చిలకలపూడి పీఎస్‌కు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు టీడీపీ ముఖ్య నేతలను పోలీసులు విచారించారు. ఇసుక అక్రమ రవాణాను నిలిపివేడయం వల్లే ఈ దాడి జరిగిందని ప్రకటించిన మంత్రి కొల్లు రవీంద్రను కూడా పోలీసులు విచారించే అవకాశముంది.

Tags:    

Similar News