TDP: టికెట్ల కేటాయింపులో మార్పులు చేపట్టిన టీడీపీ

TDP: మొత్తం ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు

Update: 2024-04-21 06:50 GMT

TDP: టికెట్ల కేటాయింపులో మార్పులు చేపట్టిన టీడీపీ

TDP: కూటమి తరపున పోటీ చేస్తోన్న అభ్యర్థుల జాబితాలో మార్పులు చేసింది టీడీపీ. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించిన అధిష్టానం, ఉండి టికెట్‌ను రఘురామకృష్ణరాజుకు కేటాయించింది. అటు మడకశిర టికెట్‌ను ఎం.ఎస్. రాజుకు కేటాయించగా.. మాడుగుల స్థానం కోసం బండారు సత్యనారాయణ మూర్తిని ప్రకటించింది. లేటెస్ట్‌గా వెంకటగిరి స్థానంలోనూ మార్పులు చేపట్టింది టీడీపీ. కురుగొండ్ల లక్ష్మీసాయి ప్రియకు బదులుగా ఆమె తండ్రి రామకృష్ణకు టికెట్ అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నివాసానికి మాజీ ఎమ్మె్ల్యే రామకృష్ణ, సాయి ప్రియ చేరుకున్నారు.

Tags:    

Similar News