అశోక్ గజపతిరాజుకు షాక్.. చెక్కు వెనక్కి పంపిన రామతీర్థం ఆలయ ఈవో

Update: 2021-01-16 13:53 GMT

అశోక్ గజపతి రాజు ఫైల్ ఫోటో 

ఏపీలో రామతీర్థం రగడ ఇంకా చల్లారలేదు. శ్రీరాముడి విగ్రహ తయారీ కోసం అశోక్ గజపతిరాజు లక్షా నూట పదహారు రూపాయల విరాళాన్ని పంపించారు. అయితే..ఆయన పంపిన విరాళాన్నిరామతీర్థం ఆలయ ఈవో తిరిగి పంపడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాముడి విగ్రహాన్ని టీటీడీ ఏర్పాటు చేస్తుందని ఆలయ ఈవో తెలిపారు. తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై అశోక్ గజపతిరాజు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

మరోవైపు.. తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అనువంశిక ధర్మకర్తగా ఎలా తొలగించారని అశోక్ మండిపడ్డారు. ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 28కి తూట్లు పొడుస్తూన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్దితులను గమనిస్తే వ్యవస్థాపక కుటుంబాన్ని దేవస్థానానికి దూరం చేసే ఉద్దేశ్యంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లుగా అనిపిస్తోందన్నారు. శ్రీ రాముని కొత్త విగ్రహాల తయారీ నిమిత్తం తాను ఇచ్చిన కానుకను తిరస్కరించారని ఇలా చేయడానికి అర్ధం ఏంటని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అశోక్‌ గజపతిరాజు.

Tags:    

Similar News