Chandrababu: మూడేళ్లలో ఎయిమ్స్ కోసం ఏం చేశారో చెప్పగలరా?
Chandrababu: వైద్యరంగంపై సీఎం జగన్ బొంకుడు ప్రకటనలు మాని ఎయిమ్స్‌లో నీటి సమస్యను పరష్కరించాలని చంద్రబాబు డిమాండ్
Chandrababu: సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. జగన్, మంత్రులు పథకాల గురించి గొప్పలు చెప్పుకోవడం పక్కనపెట్టి, మంగళగిరి ఎయిమ్స్‌కు నీటి సరఫరాపై దృష్టి పెట్టాలని సూచించారు. కనీసం నీటి వసతి కూడా కల్పించలేని ప్రభుత్వాన్ని ఏమనాలని ప్రశ్నించారు. లేఖ రాసినా పరిష్కరించకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎయిమ్స్‌కు నీటి వసతిపై కేంద్రమంత్రులు ప్రశ్నించినా స్పందించని జగన్ అన్ని వైద్య కళాశాలలు తామే తెచ్చామని శాసనసభలో అసత్య ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజ్‌లు అన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో సైతం అసత్యాలు పలికిన సీఎం.. తానుంటున్న మున్సిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. జగన్ చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదని హితవు పలికారు. ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్‌కు అవసరమైన అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ (AIIMS) కు కనీసం నీటి సరఫరా చెయ్యలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? అతి తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి.(1/5) pic.twitter.com/KQWYS13EeW
— N Chandrababu Naidu (@ncbn) September 26, 2022
అసలు వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎయిమ్స్ కోసం ఏం చేసిందో చెప్పగలదా?
— N Chandrababu Naidu (@ncbn) September 26, 2022
నాడు తెలుగుదేశం హయాంలో ఎయిమ్స్ కు భూములు ఇచ్చి, వసతులు కల్పించి వైద్య సేవలకు ఈ ప్రతిష్టాత్మక సంస్థను సిద్దం చేశాం.(2/5)
అటువంటి సంస్థ పెరిగిన తమ అవసరాల కోసం అదనంగా నీటి వనరులను సమాకూర్చాలని లేఖలు రాసినా పరిష్కరించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ లు అన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో సైతం అసత్యాలు చెప్పుకున్న ముఖ్యమంత్రి...(3/5)
— N Chandrababu Naidu (@ncbn) September 26, 2022
తానుంటున్న మునిసిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారు? స్వయంగా కేంద్ర మంత్రులు సైతం నీటి వసతి పై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పందించని ఈ ముఖ్యమంత్రి... వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లే అని బొంకుతున్నాడు.(4/5)
— N Chandrababu Naidu (@ncbn) September 26, 2022
మీ చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదు. ప్రభుత్వం వెంటనే ఎయిమ్స్ కు అవసరమైన అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలి.(5/5)
— N Chandrababu Naidu (@ncbn) September 26, 2022