ఇటువంటి పోరాటం ప్రపంచంలో ఎక్కడా చూడలేదు : చంద్రబాబు
chandrababu comments on Ap Government : అధికార వైసీపీ పై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు.. టీడీపీ సీనియర్ నేతలతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు..
chandrababu comments on AP Government : అధికార వైసీపీ పై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు.. టీడీపీ సీనియర్ నేతలతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. ప్రభుత్వం పైన మండిపడ్డారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఏపిలో పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయని అయన వాఖ్యానించారు." ఏపీ పైట్స్ కరోనా" వెబ్ సైట్ కు వచ్చిన ఫిర్యాదులపై టీడీపీ నుంచి స్పందిస్తున్నట్టుగా చంద్రబాబు వెల్లడించారు. కరోనా బాధితులకి టీడీపీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు.
ఇక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా టీడీపీ పనిచేస్తుంటే, ప్రభుత్వం మాత్రం బాధ్యతను గాలికి వదిలేసి అవినీతి కుంభకోణాల్లో మునిగి తేలుతోందని అన్నారు. అంతేకాకుండా దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని చంద్రబాబు అన్నారు. అటు రాష్ట్ర రాజధానిగా అమరావతినే ఉండాలని, 300రోజులుగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులు, మహిళలు, రైతుకూలీల పట్టుదల, దీక్ష అభినందనీయమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇటువంటి పోరాటం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని, భూములిచ్చిన రైతులకు నమ్మక ద్రోహం చేయడం వైసీపీ దుర్మార్గమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగితేనే రాజధానికి భూములు రైతులు ఇచ్చారని, అమరావతి రైతులతో ప్రభుత్వం ఒక ఒప్పందం కూడా చేసుకుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని రైతులకు సంఘీభావంగా 13 జిల్లాలలో గత 3రోజులుగా నిరసన దీక్షలు, ప్రదర్శనలు, ధర్నాలు చేసిన పార్టీలు, ప్రజా సంఘాలు, రైతుసంఘాల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు చంద్రబాబు.